Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఉద్యోగం మానేశాక అతనికి నెలకు 1.8 లక్షలు... సక్సెస్ సీక్రెట్ ఇదే!

Marketing professional earns 18 lakhs monthly after quitting job success secret revealed
Advertisement
  • కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలేసిన మార్కెటింగ్ నిపుణుడు
  • సొంత వ్యాపారంతో నెలకు రూ. 1.8 లక్షల సంపాదన
  • 9 నుంచి 5 రొటీన్‌కు దూరంగా ఫ్లెక్సిబుల్ లైఫ్
  • ఉద్యోగం మానేయాలనుకునే వారికి కీలక సలహాలు
Advertisement
అధిక ఒత్తిడితో కూడిన కార్పొరేట్ ఉద్యోగాన్ని వీడి, స్వయం ఉపాధి బాట పట్టిన ఒక 33 ఏళ్ల మార్కెటింగ్ నిపుణుడు ప్రస్తుతం నెలకు రూ.1.8 లక్షలకు పైగా సంపాదిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. తన విజయగాథను ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకోగా, ప్రస్తుతం అది నెట్టింట వైరల్‌గా మారింది.

రెండేళ్ల క్రితం తాను ఫుల్ టైమ్ ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు సదరు వ్యక్తి 'రెడిట్' పోస్ట్‌లో వెల్లడించాడు. ప్రస్తుతం తన వద్ద ముగ్గురు క్లయింట్లు ఉన్నారని, తన సొంత గ్రామం నుంచే రిమోట్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపాడు. "ప్రస్తుతం నా జీవితంలో అత్యుత్తమ దశను ఆస్వాదిస్తున్నాను" అని ఆయన పేర్కొన్నాడు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సాగే ఉద్యోగంలో ఎదురయ్యే నిత్య ప్రయాణాలు, ఆఫీస్ ఒత్తిడుల నుంచి విముక్తి లభించిందని, కుటుంబంతో సమయం గడపడానికి, వ్యక్తిగత పనులపై దృష్టి సారించడానికి ఇప్పుడు పూర్తి స్వేచ్ఛ ఉందని ఆయన హర్షం వ్యక్తం చేశాడు.

ఉద్యోగాన్ని వదిలి సొంతగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఆయన మూడు కీలక సూచనలు చేశాడు. మొదటిది, ఉద్యోగానికి రాజీనామా చేసే ముందే తగినంత పొదుపుతో పాటు ఆర్థిక భద్రత ఉండేలా చూసుకోవాలి. రెండోది, వ్యాపార ప్రారంభంలో తక్కువ ఆదాయానికి పని చేయాల్సి వచ్చినా వెనకడుగు వేయకూడదని, తద్వారా వ్యాపార మెళకువలు నేర్చుకోవచ్చని తెలిపాడు. ఇక మూడోది, ఎల్లప్పుడూ క్లయింట్లకు నాణ్యమైన ఫలితాలను అందించడంపైనే దృష్టి సారించాలని ఆయన సూచించాడు.

ఈ పోస్ట్‌పై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కార్పొరేట్ సంస్కృతి నుంచి బయటపడి, తనదైన శైలిలో స్వేచ్ఛను పొందినందుకు అతడిని అభినందిస్తున్నారు.
Advertisement
Advertisement
Marketing Professional
Remote Work Success
Quit Corporate Job
Freelancing Income Tips
Work From Home Success Story

More Telugu News